భద్రత కల్పించకపోతే ఉద్యోగాలు చేయలేం

by సూర్య | Thu, Jan 13, 2022, 02:18 PM

అనంతపురం: ఇటీవల హిందూపురం మునిసిపల్ కౌన్సిలర్లు కొందరు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిబ్బందిపై ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు భద్రత లేకపోతే ఉద్యోగాలు చేయలేమని మునిసిపల్ ఉద్యోగులు బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీకి విన్నవించుకున్నారు.


ఆర్అండ్ అతిథిగృహంలో కలెక్టర్ ను కలిసి మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి ఆనందరాజు, మరికొంతమ మంది వినతిని అందించి కలెక్టర్ తో మాట్లాడుతూ ఇటీవల కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న అధికారులపై పనుల కోసం ఒత్తిడి తెచ్చి కాని పనులు చేయాలంటున్నారు. వాటిని కాదంటే మాపై విమర్శలు చేస్తున్నారని మరీ ముఖ్యంగా గత కౌన్సిల్ సమావేశంలో ఏకంగా మునిసిపల్ కమిషనరైనే కొంతమంది. కౌన్సిలర్లు టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు.


అంతేకాకుండా కమిషనర్ ఛాంబర్కు వెళ్లి బెదిరించడం జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయాలంటే సిబ్బంది భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాకు రక్షణ కల్పించాలని కోరారు. కరోనా కష్టకాలంలో రాత్రింపగళ్లు పనిచేశాం. ఓ వైపు ఉన్నతాధికారులు ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి ఇబ్బందులు ఉన్నాకానీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అయితే మాపై విమర్శలు చేయడం మానుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో కమిషనర్ సైతం తనపై 33 వ వార్డు కౌన్సిలర్ శివ చేసిన ఆరోపణలు విమర్శలు గత కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనపై కలెక్టర్కు వినతిపత్రంతోపాటు వీడియోక్లిప్పింగ్లు అందజేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM