గుంటూరు జిల్లాలో దారుణం
 

by Suryaa Desk |

 గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన మాచర్ల నియోజక వర్గలో తెలుగు దేశం పార్టీలో కీలక నేత, అలాగే టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి అనుచరుడు. అయితే ఈయన గ్రామ సెంటర్‌ లో కూర్చుని ఉన్న సమయంలో దుండగులు ఒక్కసారిగా అటాక్ చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.ఈయన మృతి నియోజక వర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చంద్రయ్య ప్రత్యర్థులే దారుణంగా హత్య చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 


 

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM