నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

by సూర్య | Thu, Jan 13, 2022, 02:08 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2.45 లక్షల కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది.ఒమిక్రాన్ వేరియంట్ సైతం క్రమేణా వ్యాపిస్తోంది. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైంది. సెకండ్ వేవ్ తరహాలోనే రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వారాంతపు లాక్ డౌన్ లు ప్రకటించాయి.


ఇక, ఈ సమయంలో పెరుగుతున్న కేసులు... తీసుకోవాల్సిన తక్షణ చర్యల పైన ప్రధాని ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకొని.. మరోసారి కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా నియంత్రణ దిశగా కీలక చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్‌ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని సూచించారు.మహారాష్ట్ర..తమిళనాడు..కర్ణాటక..ఢిల్లీల్లో కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇక, పండుగ వేళ మరింతగా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాగాన్ని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ, ఈ సారి మరణాల సంఖ్య పెరగక పోవటం కొంత మేర ఉపశమనం ఇస్తోంది. అయినా.. కేసుల సంఖ్య రెండున్నార లక్షలు దాటటంతో .. వ్యాప్తి కట్టడి చర్యల పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది.


 


అదే సమయంలో కరోనా పరీక్షలు..చికిత్స పైన రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. పండుగ తరువాత కొన్ని కఠిన నిర్ణయాల అమలు దిశగా చర్యలు ప్రకటించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో..ఈ రోజు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొని ఉంది

Latest News

 
సీఎం జగన్ పై పవన్, బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పిర్యాదు Tue, Apr 16, 2024, 01:02 PM
ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు Tue, Apr 16, 2024, 01:00 PM
ఇంటింటి ప్రచారంలో ఆదిమూలపు సతీష్ Tue, Apr 16, 2024, 01:00 PM
సింపతీ పొందాల్సిన పరిస్థితి వైసీపీకి ఉందా ? Tue, Apr 16, 2024, 12:56 PM
దాడి విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేరకంగా మాట్లాడుతున్నాయి Tue, Apr 16, 2024, 12:55 PM