వారి ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం

by సూర్య | Thu, Jan 13, 2022, 01:59 PM

కృష్ణా జిల్లా: తిరువూరు, పట్టణంలో అనుకోని అతిథిలా జోరుగా వర్షం పలకరించింది. ఈ సందర్భంగా ఈ గురువారం నాడు ఉదయం నుంచి ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతోను సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల తొ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో అకాల వర్షం వారి ఆశలపై వర్షంనీరు చల్లింది. వర్షం వలన సంక్రాంతి పండుగ సందర్భంగా అనాదిగా జరుపుకుంటున్న కోడి పందాలు సైతం రద్దు అయ్యే అవకాశం ఉంది అని పందెంరాయుళ్లు వాపోతున్నారు. జంతు ప్రేమికులు మాత్రం అనుకోని విధంగా వర్షం రావడం వలన కోడి పందాలు రద్దు అయ్యాయి అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనుకోని ఈ విపత్తు వలన మిర్చి మరియు పత్తి రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Latest News

 
ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి Sun, Sep 25, 2022, 01:19 PM
స్కూళ్లలో ట్యాబ్స్ అందజేత ఆలస్యం! Sun, Sep 25, 2022, 12:04 PM
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM