టీడీపీ నేత హత్యను ఖండించిన లోకేష్
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత చంద్రయ్య దారుణ హత్యపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు గ్రామంలో వైసీపీ ఫ్యాక్షన్ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM