నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీఎస్ ఆర్టీసీ హెచ్చరిక

by సూర్య | Thu, Jan 13, 2022, 11:58 AM

ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చీటింగ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ ఆర్టీసీ సూచించింది. అధికారిక ప్రకటన మినహా బయట ఎవరు ఇలాంటి మాటలు చెప్పినా మోసపోతున్నట్లు హెచ్చరించింది. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి యువతను మోసం చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. ఏపీఎస్ ఆర్టీసీ మదనపల్లి, విజయవాడ పేర్లతో ఫేక్ మెయిల్‌ ఐడీలు క్రియేట్ చేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బయట పడింది. దీంతో యువత, నిరుద్యోగుల్ని అలర్ట్ చేస్తూ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. నవీన్ కుమార్​తో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, మోసపూరిత దళారులను నమ్మవద్దని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆర్టీసీ కోరింది.


ఇక పండుగ సందర్భంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు నజర్ పెట్టారు. స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లు ప్రైవేటు ట్రావెల్స్‌ను తనిఖీ చేస్తున్నారు. ప్రైవేటు దోపిడీపై 91542 94722 నంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు కమిషనర్‌ సూచించారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM