యూపీ బీజేపీకి ఊహించని ట్విస్టులు... మరో మంత్రి రాజీనామా

by సూర్య | Wed, Jan 12, 2022, 08:57 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదిత్యనాథ్ యోగి సర్కార్కు రానున్న ఎన్నికల్లో ముప్పు తప్పినట్లే గా కనిపిస్తోంది. తాజాగా మరో మంత్రి ఆ ప్రభుత్వాన్ని విడిపోయారు.యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో రైతులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగ యువత నిర్లక్ష్యానికి గురయ్యారని మంత్రి దారా సింగ్ ఆరోపించారు. వెనుకబడిన, దళితుల రిజర్వేషన్లు అంటూ గేమ్స్ ఆడుతున్నారని దారా సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్ల మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేస్తున్నానని దారా సింగ్ చౌహాన్ అన్నారు. దారాసింగ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బధుబన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. తాను పార్టీని వీడటంతో బీజేపీలో భూకంపం వచ్చిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని స్వామి ప్రసాద్ సమర్ధించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మంగళవారం ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరు రాజీనామా చేసి 24 గంటలైనా గడవక ముందే మరో మంత్రి ఝలక్ ఇచ్చారు. యోగి క్యాబినెట్‌లోని మంత్రి దారా సింగ్ చౌహన్ బుధవారం రాజీనామా చేశారు. దీంతో రెండు రోజుల్లోనే ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పినట్టయ్యింది. దారా సింగ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM