కరోనా కరెన్సీ ద్వారా వస్తుందా తేల్చండి
 

by Suryaa Desk |

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా  ఇప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడో వేవ్ ముప్పుతో రాష్ట్రాలన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ ఈ వైరస్ వ్యాప్తిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సెయిట్) కూడా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి క్లారిఫికేషన్ కోరుతోంది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి ఉందో లేదో తెలుపాలని కేంద్ర ఆరోగ్య శాఖను కోరింది. ఈ ముఖ్యమైన విషయంపై ఆరోగ్య శాఖ నోరు మెదపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఉందా లేదా అనేదానిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవియా, ఐసీఎంఆర్ ఛైర్మన్ డాక్టర్ బలరాం భార్గవకు రాసిన లేఖలో సెయిట్ కోరింది. దేశంలో లక్షలాది మంది వ్యాపారులు పెద్ద మొత్తంలో నోట్లతో నిత్యం లక్షల లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం నోట్ల ద్వారా వైరస్ వస్తుందో రావట్లేదో స్పష్టత ఇవ్వడం అత్యంత ముఖ్యమని సెయిట్ పేర్కొంది.

Latest News
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM