ఇంటి నిర్మాణం కోసం డబ్బు అడిగిన వరకట్నం కిందే

by సూర్య | Wed, Jan 12, 2022, 08:51 PM

వరకట్నం కేసు విషయంలో న్యాయవ్యవస్థ ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి భార్యను డబ్బులు అడిగినా అది వరకట్నం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం తన భర్త, మావయ్యలు పెడుతున్న వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో భర్త, మావయ్యలపై కట్నం వేధింపులు, వరకట్న మరణం, ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు నమోదైంది. సాక్ష్యాలను పరిశీలించిన ట్రయల్ కోర్టు సెక్షన్ 304-బీ, 498-ఏ ఐపీసీ కింద దోషులిద్దరికిీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే వారు దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు అడిగారని శిక్షను రద్దు చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఇంటి నిర్మాణం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను కోరడం వరకట్నం డిమాండ్‌ చేయడం కిందకే వస్తుందని చెప్పింది. ఏదైనా ఆస్తిని లేదా వాల్యుబుల్ సెక్యూరిటీని అడగడం కట్నం నిర్వచనం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నేరానికి నిందితులకు శిక్ష విధించడం కరెక్టే అని తేల్చి చెప్పింది. అయితే శిక్ష‌ను ఏడేళ్లకు కుదించింది. కాగా ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు తప్పుగా భావించిందని చెప్పింది. చట్టంలోని మూల ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించింది.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM