ప్రైవేట్ వాహనదారుల ఆగడాలపై ఫిర్యాదు చేయండి

by సూర్య | Wed, Jan 12, 2022, 07:57 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ కి వెళ్లే వారి సంఖ్య పెరగడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సుల ఆగడాలపై ఏవైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 9154294722 కు సమాచారం ఇవ్వాలని రవాణాశాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ వచ్చే రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద రద్దీ ఎక్కువైపోయి వాహనాలు కొన్ని కిలో మీటర్ల మేర నిలబడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏపీఎస్ ఆర్టీసీనే స్పెషల్ బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంతో.. ఇక తమకు తిరేగేందని ప్రైవేటు ట్రావెల్స్ భావించాయో, ఏమో గాని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ట్రావెల్స్‌‌పై రాష్ట్ర ర‌వాణా శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. అలాగే, అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ర‌వాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నాయి. ట్యాక్స్, పర్మిట్, ఫిట్నెస్ లేని వాహనాలు, అధిక రేట్ల వసూళ్లపై రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ బస్సులైనా కోవిడ్ ప్రోటోకాల్ నుసరించకపోయినా, అధిక రేట్లు వసూలు చేసినా, నిబంధనల ప్రకారం లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించడంతో ఏపీ రవాణా శాఖకమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వలో దాడులు చేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్‌ వాహనాలు స్టేజీ క్యారియర్లుగా నడపటం, సరైన పత్రాలు లేని వాహనాలపై అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించకుండా మోటార్‌ వాహనాల చట్టాలకు లోబడి వాహనాలను నడపాలని రవాణాశాఖ అధికారలు పేర్కొన్నారు. 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM