మార్కెట్లోకి టీటీడీ కొత్త ప్రోడక్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 07:53 PM

మార్కెట్‌లోకి టీటీడీ కొత్త  తీసుకొస్తోంది.నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఈఓ బుధవారం పరిశీలించారు. ఈఓ మాట్లాడుతూ.. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలు రకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసి సాంకేతిక సహకారంతో 15 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నామని.. పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, అగరబత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, ధూప్ చూర్ణం, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ధూప్ చూర్ణం సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు, కౌడంగ్ లాగ్ ఉన్నాయని ఈఓ తెలిపారు. పంచభూతాల సాక్షిగా ఐదు హోమ గుండాల్లో ఎంతో పవిత్రంగా విభూది తయారు చేస్తున్నామని.. అగరబత్తీల తరహాలతోనే ఈ ఉత్పత్తులను కూడా భక్తులు ఆదరించాలని ఆయన కోరారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM