సిటీ కార్పొరేషన్ కు... వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం
 

by Suryaa Desk |

క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. ఏపీ రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమయింది. అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో 16 గ్రామాలు క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ రోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014 సీఆర్డీయే చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ మాత్రమే తాము అనుకూలమని గ్రామ సభల్లో ప్రజలు స్పష్టం చేశారు. 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని... రాజధానిని ముక్కలు చేసే ప్రయత్నాన్ని తాము ఒప్పుకోబోమని చెప్పారు.

Latest News
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM