క్షమాపణలు చెప్పినందుకు సంతోషం

by సూర్య | Wed, Jan 12, 2022, 07:03 PM

హీరో సిద్దార్థ్ తాను చేసిన వ్యాఖ్యలపై స్వయంగా క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై సినీ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సిద్ధార్థ్ అనడంతో ఎంతో మంది విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సైనాకు సిద్ధార్థ్ క్షమాపణ చెప్పారు. మీ మీద వేసిన జోక్ కు క్షమాపణ చెపుతున్నానని... మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తే అది మంచి జోక్ కాదని అన్నారు. నువ్వు ఎప్పుడూ మా ఛాంపియన్ వేనని చెప్పారు. తన క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో సైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు. ఆయన క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ట్వీట్ చేశారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM