ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని
 

by Suryaa Desk |

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుత పరిస్థితులను గమనంలోకి తీసుకొని క్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడినని చలోక్తులు విసిరారు. తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానినని ఆయన తెలిపారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడినని' ఆయన పవన్ సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఈ రోజు హైదరాబాదులోని రఘురాజు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. ఈ నెల 17వ తేదీన తమ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను ఆ రోజున విచారణకు హాజరవుతానని సీఐడీ అధికారులకు ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ పై ఆయన మండిపడ్డారు. 'సునీల్ ఒక ఉన్మాది' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో తనను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేకుండా చేశారని రఘురాజు మండిపడ్డారు. తనపై, తన వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు కూడా సమర్పించానని తెలిపారు. ఇదిలావుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ఇటీవలే రఘురాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి భీమవరంకు వెళ్తానని, అక్కడ రెండు రోజులు ఉంటానని కూడా ఆయన తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఏపీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM