ఆ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త..!

by సూర్య | Wed, Jan 12, 2022, 03:57 PM

ప్రభుత్వరంగబ్యాంకుఅయిన యూసీఓ బ్యాంకు తన 79వ దినోత్సవం సందర్భంగా ప్రీమియం కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. యూసీవోబ్యాంకు రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌కార్డులను ఎంపిక చేసింది. రూపే సెలెక్ట్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ప్రారంభించబడింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI )తో కలిసి UCO బ్యాంక్ తన ప్రీమియం కస్టమర్ సెగ్మెంట్ కోసం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ అనేక ప్రయోజనాలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. కార్డ్ ద్వారా, వినియోగదారులు POS లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 2 లక్షల వరకు కొనుగోళ్లు చేయవచ్చు. అదే సమయంలో, ATM నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితి రూ. 50,000 వరకు ఉంటుంది. అలాగే జిమ్ సభ్యత్వం, దేశీయంగా అంతర్జాతీయ లాంజ్ వరకు ప్రీమియం సౌకర్యాలను పొందేందుకు ఈ కార్డును ఉపయోగించవచ్చని యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇష్రాక్ అలీ ఖాన్ తెలిపారు.

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM