రౌడీ షీటర్ దారుణ హత్య..?
 

by Suryaa Desk |

విజయనగరం: మేఘాద్రి గెడ్డ డ్యామ్ లో అనుమానాస్పద స్థితిలో రౌడీ షీటర్ మృతి చెందాడు. అతని ఒంటి పై గాయాలు ఉండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. రౌడీషీటర్ ల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. విజయనగరానికి చెందిన వీరబాబు 15 ఏళ్ల క్రితం గోపాలపట్నానికి వచ్చి టీ, సమోసా అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సునీత అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుని గోపాలపట్నంలొనే నివాసం ఉండేవాడు.


వీరబాబు తాగుడికి, గంజాయికి బానిస అయి భార్యని సరిగ్గా చూసుకునే వాడు కాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్యతరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. నాలుగు ఏళ్ల క్రితం ఇద్దరు విడిపోయారు. ఒంటరిగా ఉంటున్న వీరబాబు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మేఘాద్రి గెడ్డ డ్యాంలో చనిపోయి కనిపించాడు. అతని ముఖము పై అలాగే ఛాతీ పైన గాయాలు ఉండటంతో తన కుమారుడిని హత్య చేసి డ్యామ్ లో పడేసారని వీరబాబు తండ్రి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


గోపాలపట్నంకు చెందిన రౌడీ షీటర్ పిడుగు శ్రీను గంజాయి వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. హత్యకు గురైనరౌడీ షీటర్ వీరబాబుకు పిడుగు శ్రీను మధ్య గంజాయికి సంబంధించి గొడవ జరిగి నట్లు తెలుస్తుంది. పిడుగు శ్రీను కు సంబంధించిన అన్ని విషయాలనువీరబాబు అందరికి చెబుతున్నాడనే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరబాబు హత్యకు గురవడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

Latest News
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM
వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు: గుంటుపల్లి శ్రీదేవి చౌదరి Sat, Jan 29, 2022, 02:27 PM