భార్యతో శారీరకంగా కలవని భర్త.. విసుగెత్తి చివరకు అలా!

by సూర్య | Wed, Jan 12, 2022, 02:10 PM

భర్త తనతో శారీరకంగా కలిసేందుకు, శృంగారం చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ 24 ఏళ్ల యువతికి 2018లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువకుడితో వివాహమైంది. కొంత కాలం అతను తన భార్యను బాగానే చూసుకున్నాడు. హ్యాపీగా సాగుతున్న వీరి కాపురంలోకి భర్త దురాశ చిచ్చు పెట్టింది. అదనపుకట్నం కావాలని వేధించడం మొదలు పెట్టాడు. అలాగే ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. చీటికి మాటికి గొడవ పడుతుండటంతో విసుగెత్తిపోయిన భార్య జనవరి 2020లో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని తిరిగి కాపురానికి తీసుకెళ్లాడు. 2020 ఫిబ్రవరిలో ఆమెను తీసుకెళ్లినప్పటి నుంచి తన భార్యతో శృంగారం చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆమె కలుద్దామని అడిగినప్పుడల్లా ఆమెను తిట్టికొట్టి హింసించేవాడు. వివాహ బంధానికి విలువనిస్తూ తన భర్త మారుతాడన్న ఆశతో ఓపికగా ఉన్న ఆ మహిళకు ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా చిత్రహింసలకు గురిచేస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు.

Latest News

 
ప్రజలు పన్నుకడుతుంటే మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ Mon, Jun 05, 2023, 09:48 PM
ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాలకు విశాఖ హబ్‌ కావాలి,,,సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:21 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో గుడివాడ అమర్నాథ్ Mon, Jun 05, 2023, 09:20 PM
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:20 PM
ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Mon, Jun 05, 2023, 09:19 PM