ఆంధ్రా శబరిమలైగా పేరుగాంచిన ద్వారపూడి క్షేత్రం

by సూర్య | Wed, Jan 12, 2022, 12:01 PM

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గత రెండేళ్లుగా అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరిగింది. కేరళ రాష్ట్రం లోని శబరిమలై వెళ్లడానికి అనేక ఆంక్షలు ఉండటంతో భక్తులు ఈ ఆలయానికి మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.


మకరసంక్రాంతి నాడు శబరిమలైలో జ్యోతి దర్శనం మాదిరిగానే ద్వారపూడి లో కూడా అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం వైభంగా నిర్వహిస్తుంటారు.అందుకే భక్తులు జ్యోతి దర్శనం కోసం తరలి వస్తుంటారు.


అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని 1989లో కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రారంభించారు.వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన ద్వారపూడికి తమిళనాడు నుంచి విచ్చేసి వ్యాపార రీత్యా స్థిరపడిన అయ్యప్పస్వామి భక్తులు కనకరాజు గురుస్వామి ఈ ఆలయానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 40 టన్నుల ఏకశిలతో 18 మెట్లను నిర్మించారు. తమిళనాడు లోని తీరమూరు గ్రామం లో ఈ పద్దెనిమిది మెట్ల శిలను తయారుచేయించి తీసుకొచ్చారు. అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన వారు ఇరుముడితో మాత్రమే ఈ మెట్లెక్కి స్వామి వారిని దర్శించు కోవాలి. ఇక్కడ శబరిమల తరహాలోనే ఆలయం చుట్టూ తిరిగేందుకు ప్రత్యేక నిర్మాణాలను చేపట్టారు.ఆలయ క్రింద భాగంలో దుర్గమ్మ వారి ఆలయం ఉండగా పైభాగంలో అయ్యప్ప స్వామి వారు కొలువై ఉంటారు.


ఏ ముహూర్తాన ఈ ఆలయం నిర్మించారో తెలియదుగానీ ఎక్కడాలేనన్ని దేవుళ్ళు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. దేశంలో అరుదైన దేవాలన్నీ ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. ముఖ్యంగా అష్టాదశ ఉమా లింగేశ్వర స్వామి వారి ఆలయం అనేక ప్రత్యేకతలతో నిర్మితమైంది.


సంతానం లేని వాళ్ళు ద్వారపూడి అయ్యప్పస్వామి వారిని వేడుకుంటే సంతానం కల్గిస్తారని భక్తుల నమ్మకం.అలాగే అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఈ స్వామి వారు ఆదుకుంటారనేది విశ్వాసం. అందుకునే సంతానం కలిగిన వాళ్ళు, ఆరోగ్యం కుదుట పడిన వాళ్లకు స్వామి వార్కి తులాభారం ఇస్తుంటారు.రూపాయి నాణేలు, పటికి బెల్లం వంటివాటితో ఈ తులాభారం ఇస్తారు. ఈ తులాభారం ఇచ్చేందుకు బంధుమిత్రులతో వచ్చి వేడుకుగా జరుపుకుంటారు. అందుకే అయ్యప్ప స్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాలకు మధ్యలో ప్రత్యేక తులాభారం మందిరాన్ని నిర్మించారు.ఈ ఆలయాలను చాలా మందికి దర్శించుకుని ఉంటారు. కాని ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఆలయాలు చాలా మందికి తెలిదనే చెప్పాలి.

Latest News

 
తుఫాను ముప్పు.. ఈ జిల్లాలపై తీవ్ర ఎఫెక్ట్..! Mon, Oct 03, 2022, 12:45 PM
మద్యం మత్తులో దాడి.. వృద్ధుడు మృతి Mon, Oct 03, 2022, 12:42 PM
అయ్యన్నను కలిసిన టీడీపీ నేతలు Mon, Oct 03, 2022, 12:41 PM
హాస్పిటల్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి Mon, Oct 03, 2022, 12:30 PM
ఏపీలో ఆ ప్రాంతాలకు అలర్ట్ Mon, Oct 03, 2022, 12:24 PM