అల్లుడి తమ్ముడితో అత్త ఎఫైర్.. చివరకు అలా!

by సూర్య | Wed, Jan 12, 2022, 11:52 AM

తాత్కాలిక సుఖాల కోసం వావివరుసలు మరిచి ప్రవర్తించిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కూతురి భర్త తమ్ముడితో ఓ అత్త నడిపిన ప్రేమ వ్యవహారం చివరకు దారుణంగా ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గూడవాండ్లపల్లెలో చోటు చేసుకున్న ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


తెలంగాణ రాష్ట్రాంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సోని కొంతకాలంగా సీకేదిన్నే మండలం గూడవాండ్ల పల్లెలో నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త కొన్నేళ్ల క్రిందట అనారోగ్యంతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్న సోనీ తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లీళ్లు చేసింది. పెద్ద కుమార్తెను కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. తరచూ పెద్ద కూతురు ఇంటికి రాకపోకలు సాగించే సోనీకి తన అల్లుడికి సోదరుడైన హిమామ్‌ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వచ్చేసి సహజీవనం చేస్తున్నారు. సీకే దిన్నె మండలం గుడవాండ్లపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి పీకలదాకా తాగి గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాట అనుకోవడంతో సోనీ మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిమామ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Latest News

 
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM
ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌తో భారత్ ఢీ Sun, Sep 25, 2022, 10:38 AM
ఏపీలో నేడు జిల్లాల వారీగా వాతావరణ సమాచారం Sun, Sep 25, 2022, 10:33 AM