రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు

by సూర్య | Wed, Jan 12, 2022, 10:11 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం.1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది.తొలుత ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వర్ణ రధంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎల్లుండి ద్వాదశి రోజున ఉదయం 5 నుండి 6 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.స్వయంగా వచ్చిన విఐపిలకు మాత్రం శ్రీవారి దర్శనం పాసులు ఇవ్వనున్నట్లు టీటీడీ పేర్కోంది. స్వయంగా వచ్చిన వీఐపీలకు దర్శనం, వసతి ఏర్పాట్లకు శ్రీ పద్మావతి అతిథి గృహం పరిధిలోని వెంకటకళా, రామ్ రాజ్, సీతా, గోవింద్ సాయి, సన్నిదానం అతిధి గృహాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


 


 

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM