పొత్తులపై స్పందించిన జనసేన అధినేత పవన్

by సూర్య | Tue, Jan 11, 2022, 09:11 PM

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసింది.రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేసినందుకు ధన్యవాదాలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌ అయితే  పొత్తుల విషయంలో తాను ఒకడినే నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. ప్రతి జనసేన కార్యకర్త ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకున్నాకే 2024 ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండాలనేది నిర్ణయిం తీసుకుంటామని తెలిపారు. అప్పటి దాకా జనసేన పార్టీ కార్యకర్తలు,శ్రేణులు అంత ఒకే మాట మీద ఉండాలి అని సూచించారు. పార్టీ కార్యవర్గ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో జనసేన పుంజుకుంటోందన్నారు.ఈ క్రమంలోనే వివిధ పార్టీలు జనసేనతో పొత్తు కోరవచ్చని పవన్ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను పూర్తి చేస్తామన్నారు. గతేడాది కోవిడ్ కారణంగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించలేదని, ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. కమిటీ ఆదేశాల మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.సంక్రాంతి తర్వాత మళ్లీ పార్టీ శ్రేణులతో భేటీ అవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM