సిద్దార్ట్ పై చర్యలు తీసుకోండి:డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ

by సూర్య | Tue, Jan 11, 2022, 06:11 PM

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై తాము మోటోగా విచారణకు స్వీకరించామని, సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ రాసినట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది.  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ కు ఇది కొత్తేమీ కాదని, పదేపదే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల సిద్ధార్థ్ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా ఇలాగే వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. మహిళా యాంకర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అనైతిక వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఈ అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించిందని, సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ రాసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా అతడిని నిరోధించాలని కోరినట్టు రేఖా శర్మ తెలిపారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM