కరోనా దూకుడు ప్రదర్శించినా...ఊప తగ్గని స్టాక్ మార్కెట్

by సూర్య | Tue, Jan 11, 2022, 06:09 PM

కరోనా కారణంగా మరోసారి యావత్తు ప్రపంచం వణుకుతున్నా, ఆర్థికంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్న స్టాక్ మార్కెట్ లో మాత్రం ఆ బేంగ కనిపించలేదు.


దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 60,617కి చేరుకుంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,056 వద్ద స్థిరపడింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం లేదు... ఈ వేరియంట్ లో వైరల్ లోడ్ తక్కువగా ఉంటుందని, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మార్కెట్లు లాభపడ్డాయి. ఇక ఐటీ షేర్లు ఈనాటి లాభాలను ముందుండి నడిపించాయి.


 బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.30%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.74%), టెక్ మహీంద్రా (1.58%), టీసీఎస్ (0.99%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.71%).


టాప్ లూజర్స్:


టాటా స్టీల్ (-3.32%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.89%), ఐటీసీ (-0.65%), కోటక్ బ్యాంక్ (-0.51%), డాక్టర్ రెడ్డీస్ (-0.49%).

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM