విశాఖ జిల్లాలో కరోనా నిబంధనలు కఠినం

by సూర్య | Tue, Jan 11, 2022, 04:07 PM

ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠినం చేసింది. నైట్ కర్ఫ్యూని విధించి కీలక నిర్ణయం తీసుకుంది.


తాజాగా నైట్ కర్ఫ్యూ నిబంధనలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెలాఖరు వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిత్యావసర వస్తువులు, వైద్య చికిత్స వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ 100 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. అయితే సంక్రాంతి పండగ ను దృష్టిలో ఉంచుకుని అంతరాష్ట్ర రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.


ఇక సినిమా సినిమా థియేటర్లలో సీటుకు మధ్య గ్యాప్ ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అంటే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లలో సినిమాలను ప్రదర్శించుకోవడానికి అనుమతినిచ్చింది. ప్రజా రవాణాలో ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లోకి వినియోగదారుడు తప్పని సరిగా మాస్క్ ధరించి వెళ్ళాలని తెలిపింది. ఒకవేళ మాస్క్ ధరించని వినియోగాదారుడిని షాపుల్లోకి అనుమతినిచ్చే.. ఆ షాప్ నిర్వాహకులకు గరిష్టంగా రూ. 25,000 జరిమానా విధించానున్నామని తెలిపింది.


ప్రార్ధనా మందిరాల్లో కోవిడ్ నిభందనలు తప్పనిసరి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకుండ బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారికి రూ. 100 రూపాయలు జరిమానా విధించడమే కాదు.. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Latest News

 
రెండో రోజు నాలుగు నామినేషన్లు Sat, Apr 20, 2024, 10:49 AM
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM