దినదినాభివృద్ధి చెందుతున్న జగనన్న మహిళా మార్ట్

by సూర్య | Tue, Jan 11, 2022, 04:03 PM

మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని, వారిలో దాగివున్న వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాలలో సైతం అనితర ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయ సాధనలో భాగంగా మహిళలను సంఘటిత పరచి, వారిని వ్యాపార రంగంలో రాణింపచేసే ప్రయత్నంలో భాగంగా అక్క చెల్లెమ్మలను సన్నద్ధం చేశారు.


ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాయచోటిలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్ దినదినాభివృద్ది చెందుతోంది. వ్యాపారంలో సైతం తాము తక్కువ కాదన్న రీతిలో అనేక మంది మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించడంతో పాటు మరెంతో మంది పేద మహిళలకు ఉపాధి అందుతోంది.


ఎవరిపైనా పెట్టుబడి భారం పడకుండా చిన్నపాటి మొత్తంతో డ్వాక్రా సభ్యులే అంతాతామై నిర్వహించేలా రాయచోటి పట్టణంలో ఆవిర్భవించిన జగనన్న మహిళా మార్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. పేద ప్రజలకు తక్కువ ధరలతో, నాణ్యమైన సరుకులు ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు తోడు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రూపుదిద్దు కుని ఈ నెల 2 న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన ఈ మార్ట్ పనితీరుతో తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందేలా చేస్తూ అందరి చూపును మార్ట్ పై నిలిచేలా చేస్తోంది.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM