ఒంటరిగా ఎన్నికలలో పోటి చేస్తాం: మంత్రి

by సూర్య | Tue, Jan 11, 2022, 03:56 PM

టైగర్ అడవిలో ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుందని మేము కూడా రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మంత్రి రంగనాదరాజు అన్నారు. సీఎం జగన్ బుధవారం గుంటూరు రానున్న నేపథ్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను మంగళవారం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాద రాజు పరిశీలించారు.


అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరినైనా ముంచడానికి చంద్రబాబు జతకడతారని పవన్ కళ్యాణ్ కు అదిచేస్తాం ఇది చేస్తాం అని అంటారని, చంద్రబాబు హయాంలో టిడిపి ఎమ్మెల్యేలు రౌడీ రాజ్యం తలపించేలా చేశారని, 14ఏళ్ళ పాలనలో చంద్రబాబు రైతులను పట్టించు కోలేదని మంత్రి రంగ నాద రాజు చంద్రబాబు పై మండిపడ్డారు.


గుంటూరులోవైసీపీకి ఓటు వేస్తే మూడు రాజదాని లకు ఓటు వేసిన ట్లే అని చంద్రబాబు ప్రచారం చేశారని, గుంటూరు ప్రజలు చంద్రబాబు మాటలను పట్టించు కోకుందా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మేయర్ పదవి కట్ట బెట్టారని ఆయన అన్నారు.


బుధవారం గుంటూరు పట్టణంలో ఐటీసీ స్టార్ హోటల్ ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని, చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేస్తుంటారని, ఎన్నికలలో ఎప్పుడూ వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, అడవిలో పులి వాలే మేముకుడా దేనికి భయపడేది లేదని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాద రాజు మీడియాతో అన్నారు.

Latest News

 
ఏపీలో నేడు జిల్లాల వారీగా వాతావరణ సమాచారం Sun, Sep 25, 2022, 10:33 AM
నేడు దేశవ్యాప్తంగా 4,777 కోవిడ్ పాజిటివ్ కేసులు Sun, Sep 25, 2022, 10:23 AM
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM