హోటల్ గదికెళ్లిన మహిళ..భర్తే కాలయముడై ఘోరం

by సూర్య | Tue, Jan 11, 2022, 03:30 PM

ప్రియాంక అనే మహిళకు అర్జున్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నర తరువాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో భర్త నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఢిల్లీలోని తన సమీప బంధువులు దగ్గర నివాసం ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని.. కూతురితో కాలం గడుపుతోంది. అయితే తన భార్య తనతో ఉండపోవడంతో ఆమె భర్తకు కోపం పెరిగింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు అర్జున్. ఇందుకోసం ఆమెను ప్రేమగా మాట్లాడి బుట్టలో పడేశాడు. ఆదివారం ప్రియాంక పుట్టినరోజు కావడంతో హోటల్ గదికి రావాలని పిలిచాడు. భార్య కోసం కొన్ని బహుమతులు కూడా తెచ్చానని నమ్మించాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ప్రియాంక తన భర్త ఉంటున్న హోటల్ గదికి వెళ్లలేకపోయింది.


సోమవారం మరోసారి భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాడు అర్జున్. కచ్చితంగా రావాలని పదే పదే ఆమెను కోరాడు. అయితే భర్త మారిపోయాడని ప్రియాంక నమ్మింది. అతడు ఉంటున్న హోటల్ గదికి వెళ్లింది. తాను ఉంటున్న గదికి వచ్చిన భార్యను వెంటనే బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు అర్జున్. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆమె మెడను కోసేశాడు. దీంతో ప్రియాంక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆమె కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే వెంటనే అక్కడి పారిపోయాడు అర్జున్. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి తోసేశాడు. ప్రియాంక హత్య గురించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియాంకను వరకట్నం డిమాండ్ చేయడంతో అత్తమామలు కొట్టేవారని బంధువులు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన భర్త అర్జున్‌పై బంధువులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే భర్త తనను హత్య చేస్తాడని ఊహించలేక పోయిన ప్రియాంకకు ఈ రకంగా జరగడంతో ఆమె ఏడాదిన్నర కూతురు అనాథగా మారిపోయింది.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM