విధుల్లో చేరకపోతే నష్టపోతారు: అజయ్ జైన్
 

by Suryaa Desk |

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు. ప్రభుత్వం అందరికీ ప్రొబేషన్, కన్ ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించదు. రోడ్లపైకి వస్తే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలోస్తాయని అనుకుంటున్నారేమో.. ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే తర్వాత నష్టపోతారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో అన్నారు. వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా విధుల్లో చేరి నిరసనలు కొనసాగిస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Latest News
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి Sat, Jan 29, 2022, 04:41 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పై ఎస్మా? Sat, Jan 29, 2022, 04:36 PM
రూ.6400 కోట్ల‌తో ర‌హదారుల నిర్మాణం Sat, Jan 29, 2022, 04:25 PM
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM