జనవరి 31 వరకు కర్ఫ్యూ.. వీటికి మినహాయింపు!
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపింది. పెళ్లిళ్లు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో 200, ఇండోర్ లో 100 కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఆదేశించింది. 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM