నరసాపురం ఉప ఎన్నికల్లో మరో సంచలనం..!

by సూర్య | Tue, Jan 11, 2022, 01:48 PM

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం బాగా హాట్ టాపిక్‌ అవుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి..ఇంతకాలం అదే పార్టీపై విరుచుకుపడుతున్న రఘురామ, సడన్‌గా రాజీనామా చేయడానికి రెడీ అయిపోయారు.


ఇప్పటివరకు వైసీపీ ఎంత పోరాడిన రాజు గారు వెనక్కి తగ్గలేదు. అనర్హత వేటు కూడా వేయించలేకపోయారు. దీంతో సడన్‌గా రాజు గారు రూట్ మార్చేశారు. ఇక వైసీపీని వీడబోతున్నట్లు చెప్పిన రాజు గారు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.


 


అయితే ఫిబ్రవరి 5 వరకు వైసీపీ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని, లేదంటే తమకు చేతకాదు అంటే తానే రాజీనామా చేసేస్తానని రఘురామ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రాజు గారు ఫిబ్రవరిలో రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది. కాకపోతే రాజీనామా చేసి ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్‌గా మారింది. కేంద్రం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరి, టీడీపీ-జనసేనల సపోర్ట్ తీసుకుని నరసాపురం ఉపఎన్నికల బరిలో గెలవాలని చూస్తున్నారు.


 


కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఉంది..రాజు గారు బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు అంతగా సహకరించేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి బీజేపీలో చేరితే రాజు గారికే కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకే రాజు గారు ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది.


 


అప్పుడు ఇండిపెండెంట్‌గా ఉంటూ టీడీపీ-జనసేన-బీజేపీల మద్ధతు తీసుకోవాలని రాజు గారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీగా గెలిచాక బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కానీ ముందు మాత్రం ఇండిపెండెంట్‌గానే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మరి చూడాలి రాజు గారు స్ట్రాటజీలు ఎలా ఉన్నాయో ?

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM