ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు: సీఎం జగన్
 

by Suryaa Desk |

ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. మొదటి దశలో 15.60లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతున్నాయన్నారు. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాలు అందిస్తామని సీఎం వివరించారు.


తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కీమ్ లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్లాట్ల కోసం https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM