మార్ఫింగ్‌ చిత్రాలతో బ్లాక్‌మెయిల్
 

by Suryaa Desk |

గుంటూరు: ఓ యువకుడు తన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి తన కోరిక తీర్చాలని, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఓ గృహిణి సోమవారం గుంటూరు అర్బన్‌ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేసింది. ‘గుంటూరుకు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన బైక్‌ మెకానిక్‌ పదేళ్ల కిందట పరిచయమై ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.


చనువుగా ఉండి ఫొటోలు తీశాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో మాట్లాడటం ఆపేసింది. తర్వాత ఆమెకు పెళ్లి అయ్యింది. నలుగురు పిల్లలు. ఈ క్రమంలో సదరు యువకుడు చనువుగా ఉన్నప్పటి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి బెదిరిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేని పక్షంలో డబ్బులు ఇవ్వాలన్నాడు. మూడు విడతలుగా రూ. 3 లక్షలు తీసుకున్నాడు. మళ్లీ డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.


వేధింపులు భరించలేక విషయాన్ని భర్తకు తెలిపింది. యువకుడిపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని ఎస్పీని కోరింది. స్పందించిన అధికారులు వెంటనే నిందితుడిపై చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM