గుంటూరు జిల్లాలో విషాద ఘటన

by సూర్య | Tue, Jan 11, 2022, 12:42 PM

మైనర్లు ఇద్దరూ ఇష్టపడి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇంటికి తిరిగొచ్చాక రేగిన వివాదాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సోమవారం జరిగింది. తెనాలి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. పినపాడుకు చెందిన యువకుడు ఫిల్టర్‌ నీటి క్యాన్లు సరఫరా చేసే ఆటో వద్ద పని చేస్తూ ఉంటాడు.


ఇతను స్థానిక పాఠశాలకు నీటి డబ్బాలు సరఫరా చేసే క్రమంలో ఆ బడిలో చదువుకుంటున్న 15 ఏళ్ల బాలిక పరిచయం అయింది. ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వారిని పిలిపించగా 8న తిరిగి తెనాలి వచ్చారు. ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు.


ఈ నెల 9న రాత్రి యువకుడి బంధువుల ఇంటి వద్ద ఇరువైపులా కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడానికి కూర్చున్న సమయంలో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సోమవారం ఇంటిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM