ప్రపంచం పై కరోనా పడగ

by సూర్య | Tue, Jan 11, 2022, 11:49 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21 లక్షల 4 వేల 150 మందికి వైరస్ సోకింది. మరో 4వేల 608 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31కోట్లు దాటగా... మరణాలు 55 లక్షల 11 వేల 955కు చేరాయి. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్  విలయతాండవం కొనసాగుతూనే ఉంది. అక్కడ మరో 6 లక్షల 73వేల 837 మందికి వైరస్ సోకగా... వెయ్యి 2 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో మొత్తం కేసులు 6.26 కోట్లకు చేరాయి. ఫ్రాన్స్ లో కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. కొద్ది రోజులుగా రోజుకు 2, 3 లక్షలు నమోదైన కేసులు.. సోమవారం 93వేల 896 మాత్రమే నమోదయ్యాయి. బ్రిటన్ లో మరో లక్ష 42వేల 224 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇటలీలో లక్షకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. స్పెయిన్ లో మరో 97వేల 464 మంది వైరస్  బారిన పడ్డారు. అర్జెంటీనాలో కొత్తగా 88వేల 352 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆస్ట్రేలియాలో మరో 72వేల573 మందికి వైరస్ సోకగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM