భారత్ సీరిస్ సాధిస్తుందా

by సూర్య | Tue, Jan 11, 2022, 10:53 AM

సరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతోవున్న టీంఇండియా ఆ ప్రయత్నంలో సఫలమవుతుందా అన్నది ఇపుడు అందరిలో మొదలైన చర్చ. దక్షిణాఫ్రికాతో పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని, చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉంది. మూడు టెస్టుల ఈ సిరీస్ లో భారత్, సౌతాఫ్రికాలు చెరో మ్యాచ్ ను గెలుపొందాయి. దీంతో చివరి టెస్టును గెలుచుకునే జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. కేప్ టౌన్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గాయం కారణంగా సిరాజ్ జట్టుకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశం ఉంది. మరోవైపు భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇండియా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/ఉమేశ్ యాదవ్.


దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గార్ (కెప్టెన్), మార్ క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డర్ డుస్సేన్, టెంబా బవుమా, వెర్రెనీ (వికెట్ కీపర్), జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఒలీవియర్, ఎన్గిడీ.

Latest News

 
నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది Thu, Apr 18, 2024, 10:27 AM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 10:24 AM
పది మంది జూదరులు అరెస్టు Thu, Apr 18, 2024, 10:10 AM
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM