![]() |
![]() |
by సూర్య | Tue, Jan 11, 2022, 09:32 AM
దేశంలో కొవిడ్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇలా థర్డ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో కొవిడ్ బాధితుల ఆస్పత్రి చేరికలు 5 నుంచి 10శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కొవిడ్ విజృంభణ క్రియాశీలంగానే ఉన్నందున.. రానున్న రోజుల్లో ఆస్పత్రి చేరికలు వేగంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన ఆస్పత్రి పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
Latest News