రోజు వారీ కేసులు పెరుగుతున్నాయ్:కేంద్రం వెల్లడి

by సూర్య | Tue, Jan 11, 2022, 12:02 AM

దేశంలో కరోనా వైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.52 లక్షల మంది నమూనాలను పరీక్షించగా.. 1,79,723 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 12.6 వాతం ఎక్కువ కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29 శాతానికి పెరిగింది. ఇదలావుంటే మరో 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,23,619 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 2.03కి పెరిగింది. గత 24 గంటల్లో 146 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.62 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 4033 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1216 ఒమిక్రాన్ కేసులు ఉండగా, రాజస్థాన్ లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1552 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలావుంటే కరోనా యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. సెకండ్ వేవ్ టైమ్‌లో ఇది 20 నుంచి 23 శాతంగా ఉంది. అయితే కరోనా పరిస్థితిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ ప్రభావంతో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM