ఆ తరువాత కామన్ సివిల్ కోడ్:కేంద్రం స్పష్టీకరణ

by సూర్య | Mon, Jan 10, 2022, 11:59 PM

ప్రస్తుతం లా కమిషన్ అధ్యయనం చేస్తున్న కామన్ సివిల్ కోడ్ పై నివేదిక వచ్చాకే ఆ చట్టంపై ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని కేంద్రంం స్పష్టంచచేసింది. బీజేపీ అజెండాలో ఎప్పటినుంచో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇవాళ కేంద్రం సంచలన అడుగు వేసింది. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో అమలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై తమ స్పందన తెలియజేసిన కేంద్రం.. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో బీజేపీ వైఖరిపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని ఢిల్లీ హైకోర్టులో బీజేపీకి చెందిన లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది, లా కమిషన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం సమస్యను పరిశీలిస్తుందని పేర్కొంది. అయితే, వివిధ మత వర్గాలకు చెందిన పౌరులు వేర్వేరు ఆస్తి, వివాహ చట్టాలను అనుసరిస్తున్నారని, ఇది దేశం యొక్క ఐక్యతకు అవమానకరం అని పేర్కొంది. కామన్ సివిల్ కోడ్ పై దాఖలైన పిటిషన్ కు సమాధానమిస్తూ భారత్ లో పార్లమెంటు తనకున్న సార్వభౌమాధికారంతో చట్టాలు చేస్తుందని, ఇందులో బయటి వ్యక్తుల ప్రభావం, నిర్ణయాల ఆధారంగా ఏదీ జరగదని హైకోర్టుకు తెలిపింది.అలాగే ఒక నిర్దిష్ట చట్టాన్ని రూపొందించడానికి పార్లెమంట్ కు మాండమస్ రిట్ జారీ చేసే అవకాశం ఉండదని కూడా వెల్లడించింది. ఇది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నిర్ణయించవలసిన విధానపరమైన అంశమని, ఈ విషయంలో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది. మరోవైపు ఈ పిటిషన్ లో లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ కేంద్రం.. ఉమ్మడి పౌరస్మృతిని తయారు చేసేందుకు వీలుగా జ్యుడిషియల్ కమిషన్ లేదా అత్యున్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. అలాగే ఆర్టికల్ 44 ప్రకారం.. కేంద్రం ఆదేశ సూత్రాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతం లా కమిషన్ అధ్యయనం చేస్తున్న కామన్ సివిల్ కోడ్ పై నివేదిక వచ్చాకే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపింది. అంతవరకూ వేచి చూడాలని కోరింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM