ఏపీకి భారీ విరాళం...ఇచ్చిన ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్
 

by Suryaa Desk |

కష్టాల్లోవున్న ఏపీ ప్రభుత్వాన్ని ఆదుకోవాడానికి  ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఇటీవల ఏపీలో పలు జిల్లాల్లో వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. మరోవైపు కరోనా సంక్షోభం కూడా రాష్ట్రంపై భారీగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ భారీ విరాళాన్ని ఇచ్చింది. ఈ కంపెనీ మాతృసంస్థ విర్కోస్ గ్రూప్ డైరెక్టర్ ఎం.మహావిష్ణు రెడ్డి నేడు సీఎం జగన్ ను కలిసి, రూ.1 కోటి విరాళం తాలూకు చెక్ ను ఆయనకు అందజేశారు. ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వానికి తమవంతు తోడ్పాటుగా విరాళం అందిస్తున్నామని మహావిష్ణు పేర్కొన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలంటూ అభిలషించారు. కాగా ఈ భేటీలో వైసీపీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. విర్కో గ్రూప్ గతేడాది కూడా ఏపీ కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం అందించింది.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM