టీడీపీ ఆరోపణలో వాస్తవం లేదు:టీటీడీ

by సూర్య | Mon, Jan 10, 2022, 11:46 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదర్చుకుని.. వారు ధ్రువీకరించిన రైతులకు మాత్రమే ఆవు, ఎద్దులను అందిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు ఆవులు, ఎద్దులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. పలమనేరులో పశువులను కబేళాలకు తరలిస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఆరోపణలు చేస్తూ.. ఈ రోజు ఆందోళన చేపట్టారు. పలమనేరు గోశాల వద్ద నుంచి అక్రమంగా ఆవులు, ఎద్దులను తరలిస్తున్నారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని.. గో సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ తరహా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఉచితంగా పశువులను అందిస్తున్నామని తెలిపారు. పలమనేరులోని దేశవాళీ గో అభివృద్ధి సంస్థ సహకారంతో పలమనేరు, తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణశాలల్లో.. దేశవాళి ఆవుల సంతతిని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తెలిపింది. అయితే.. పలమనేరులో గోశాల నుంచి రైతులకు పంపిణీ చేస్తున్న ఆవు, ఎద్దులను కొంతమంది అడ్డుకున్నారని.. ఈ పద్ధతి మంచిది కాదంటూ సూచించింది. పట్టాదారు పాస్‌బుక్‌లు లేకుండా ఆవులు, ఎద్దులు పంపిణీ చేశామనడం అవాస్తమని.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయొద్దంటూ సూచించింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM