మరింత అప్రమత్తంగా ఉండండి:దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిక

by సూర్య | Mon, Jan 10, 2022, 08:25 PM

ప్రపంచంపై కరోనా విరుచుకుపడుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు అమలు చేయాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియంట్‌తో ముప్పు లేదని కొట్టిపారేయడానికి లేదని హెచ్చరించింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా కోవిడ్‌ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రపంచంలో కోవిడ్ టెర్రర్‌ పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 లక్షల 17 వేల 682 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదు వేల మంది చనిపోయారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త కోవిడ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మన దేశంతో పాటు అమెరికా, ఫ్రాన్స్, రష్యా ఇలా అన్ని దేశాల్లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో ఐదేళ్లలోపు పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. కోవిడ్ కేసులతో అమెరికా అల్లాడుతోంది. ఆస్పత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. కరోనా రోగులకు సేవలందిస్తోన్న వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఒక ఆస్పత్రిలో 13,500 మంది సిబ్బందిలో 900 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఫ్రాన్స్‌లో కొత్తగా మూడు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్లో కొత్త లక్షా 46 వేల మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రష్యాలో కొత్తగా 16,568 కేసులు నమోదవగా 796 మంది చనిపోయారు. ఇక్కడ కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా మరణాలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటలీలో కొత్తగా 1,97,552 కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో ఒక్కరోజే లక్షా 15 వేల మందికి కోవిడ్ సోకింది. సామాన్యులతో పాటు దేశాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధానికి కోవిడ్ సోకింది. భారత్‌లోనూ ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM