ప్రశ్నగా వచ్చిన ట్విట్ కు మరోసారి ఆనంద్ మహింద్ర చమత్కర జవాబు

by సూర్య | Mon, Jan 10, 2022, 07:25 PM

ట్విటర్ లో వచ్చే వాటిపై. ఈ భూమి మీద జరిగే అద్భుతాలపై ఎప్పటికపుడు స్పందించే ఆనంద్ మహింద్రాకు ఇపుడు నెటీజన్లు కొన్ని సందేహాలను ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆనంద్ మహింద్ర కూడా చమత్కార సమాధానాలు ఇస్తున్నారు. ఇదిలావుంటే ఈ ప్రశ్నలకు జవాబులిస్తున్న ఆనంద్ మహింద్రా మరో సమాధానంగా కూడా చాలా చమత్కారంగా ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్స్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నెటిజెన్లు అడిగే ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో చమత్కారంతో కూడిన సమాధానాలను ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయనకు ఓ నెటిజెన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'సార్, మహీంద్రా కార్లు తప్ప ఇతర కార్లను మీరు డ్రైవ్ చేయరా?' అని నెటిజెన్ ప్రశ్నించగా... ' అంటే... మహీంద్రా కాకుండా వేరే కార్లు కూడా ఉన్నాయని చెపుతున్నారా? నాకు ఐడియా లేదే' అని సమాధానమిచ్చారు. అలాగే, ఊరికే ఏదో సరదాగా అంటున్నానంటూ స్మైలీ ఎమోజీని పెట్టారు. ఆయన చమత్కారానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM