ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోంది: సీఎం రమేశ్

by సూర్య | Mon, Jan 10, 2022, 07:14 PM

ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోంది అని  బిజెపి నేత సీఎం రమేశ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేతలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. పట్టణంలోని పద్మావతి పాఠశాల వెనుక మసీదు నిర్మాణంపై వివాదం చెలరేగింది. మసీదును అక్రమంగా నిర్మించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది.
శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని మరో వర్గం అడ్డుకుంది. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనం వేగంగా వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా, ప్రతిపక్షాలు పీఎస్‌కు చేరుకుని శ్రీకాంత్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ బీజేపీ నేతలపై జరిగిన పాశవిక దాడి, వారి పట్ల పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఇప్పటికే చెబుతున్నారని అన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రాణమైందని విమర్శించారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోంది అని  సీఎం రమేశ్ ఎద్దేవా చేసారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అన్ని విషయాలను చూస్తూనే ఉందని చెప్పారు. ఆత్మకూరులో జరిగిన ఘటనను బీజేపీ సీరియస్‌గా తీసుకుందని అన్నారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM