వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు? : జీవీఎల్‌
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.జీవీఎల్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి వివరాలుతెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే వెంటనే కేంద్రం వెంటనే స్పందించింది.


"ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం" రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే, సరిగ్గా స్పందించ లేదని పేర్కొన్నారు. "విపత్తు సహాయ నిధి" కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని జీవీఎల్‌ ప్రశ్నించారు. కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు.


 


వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు? భాధితులను ఎందుకు సీఎం ఓదార్చే ప్రయత్నం చేయడం లేదంటూ జీవీఎల్ మండిపడ్డారు. ప్రజల వద్దకు పోకుండా, ప్యాలెస్‌ నుంచి పాలన చేయాలని నిర్ణయించుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి, సహాయక చర్యలు ప్రారంభిం చాలి. రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదోవపట్టకుండా.. వెంటనే బాధితుల ఖాతాల్లో జమచే యాల న్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వెంటనే బీసీ కులాల జనాభా లెక్కింపు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్, టీడీపీ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.


 


కేంద్ర ప్రభుత్వ పథకం "జలజీవన్ మిషన్" ను సరిగా సద్వినియోగం చేసుకుని, అమలు చేయని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ. ప్రజలను అప్రమత్తం జాగృతం చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేవలం అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందా? అంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు.

Latest News
ఏటీఎంలో రూ.17 లక్షలు చోరీ Tue, Dec 07, 2021, 08:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Tue, Dec 07, 2021, 08:27 PM
కామాంధుడిపై పోక్సో కేసు నమోదు Tue, Dec 07, 2021, 04:33 PM
మిస్సింగ్ అయిన బాలల ఆచూకీ లభ్యం Tue, Dec 07, 2021, 04:28 PM
గుంటూరులో డాక్టర్ల ఆందోళన Tue, Dec 07, 2021, 04:18 PM