శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం టీటీడీ తరహా ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ

by సూర్య | Thu, Nov 25, 2021, 10:11 AM

కేరళలోని శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు వెళ్తుంటారు.మండలం-మకరవిళక్కు సీజన్‌లో శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకట్లా లక్షల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు.


 


వర్చువల్ క్యూ విధానంలో..


 


కోవిడ్ 19 వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రొటోకాల్స్‌ను పాటిస్తోంది. వాటిని కఠినంగా అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను నియంత్రించడానికి దేవస్వొం బోర్డు అధికారులు ప్రత్యేకంగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్చువల్ క్యూ విధానంలో భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తోన్నారు. ఈ విధానాన్ని మరింత సరళీకరించారు అధికారులు.


 


టీటీడీ తరహాలో..


 


కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో వెలిసిన శ్రీవారి దర్శనం కోసం ఏరకంగానైతే ఆన్‌లైన్ ద్వారా అడ్వాన్స్డ్‌గా టికెట్లను బుక్ చేసుకుంటారో.. సరిగ్గా అలాంటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై భక్తుల్లో అవగాహనను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా- టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలనే విషయంపై భక్తులకు అవగాహన కల్పించడానికి తమ అధికార యూట్యూబ్‌లో రెండు వీడియోలను పోస్ట్ చేశారు. పోలీసు అధికారుల సహాయ, సహకారాలను తీసుకున్నారు.


 


 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM