నిద్రమత్తులోకి జారుకున్న డ్రైవర్...
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా : బస్సు డ్రైవర్ నిద్రమత్తులో కి జారుకోవడం తో అదుపుతప్పిన  బస్సు డివైడర్ పైకి ఈ సంఘటన జాతీయ రహదారిపై చిలకలూరిపేట మండల పరిధిలోని పెట్రోల్ బంకు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదాని కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి AP39 టిఏ 6789 నంబరు గల ఇందు ట్రావెల్స్ బస్సు విజయవాడ వస్తోంది. చిలకలూరిపేట మండలం పరిధిలోని లక్కీ రోడ్ లైన్స్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.  మిగిలిన అందరూ క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. సిబ్బంది ఈఎంటీ యడ్ల శోభన్ బాబు, పైలెట్ ఉమామహేశ్వరరావు క్షతగాత్రులకు ఐదుగురికి అక్కడే ప్రథమ చికిత్స చేశారు. తీవ్రగాయాలైన కటారి సురేష్ బాబు ,పి. చంద్రమోహన్ లను చిలకలూరిపేటపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM