రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
 

by Suryaa Desk |

తాళ్లరేవు మండలంజాతీయ రహదారిపై గణపతినగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. శంకరయ్యపేట పెద్దాపురం బంగారమ్మ గుడి వీధికి చెందిన పీతల దుర్గాప్రసాద్, దాసరి నాగేంద్ర సోమవారం ద్విచక్రవాహనంపై యానాం వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా మోటార్‌సైకిల్‌ బోల్తా పడింది. దుర్గాప్ర సాద్ (21) తల రోడ్డుకు తగలడంతో మెదడు బయటకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేంద్రకు ఎలాంటి గాయాలు కాలేదు. కోరంగి ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM