ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

by సూర్య | Tue, Nov 23, 2021, 08:41 AM

మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ శాసన మండలి చేసిన తీర్మానాన్ని తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హాజరుకాలేదు. తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు లేవు. దాంతో ఆ రోజు శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏపీలో సంచలనం సృష్టించిన 3 రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం సోమవారం కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, మరోసారి మూడు రాజధానుల చట్టాన్ని కొన్ని మార్పులతో తీసుకువస్తామని సీఎం జగన్ చెప్పారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM