ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమైంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని మోగాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి రాగానే పంజాబ్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్న మహిళలు అదనంగా రూ.1000 పొందవచ్చని తెలిపారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యాధులకు చికిత్స, మందులు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.

Latest News
ఏపీ రూ.1392 కోట్ల 23 లక్షల రుణం:నాబార్డ్ Sat, Jan 22, 2022, 11:38 PM
చట్టాలు చేస్తే మార్పు రాదు...వాటిని కఠినంగా అమలు చేస్తేనే Sat, Jan 22, 2022, 11:37 PM
హౌతి తిరుగుబాటుదార్లపై సౌదీ అరేబియా ప్రతికార దాడులు Sat, Jan 22, 2022, 11:35 PM
ఎన్జీవోస్ ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగుల మద్దతు Sat, Jan 22, 2022, 11:32 PM
విజయనగరం మన్యం లో ఏనుగుల హల చల్.. వేల ఎకరాల్లో పంటలు ధ్వంసo Sat, Jan 22, 2022, 10:20 PM