ఇక నుంచి ఏపీకి ఒక్క రాజధానే...!

by సూర్య | Mon, Nov 22, 2021, 12:37 PM

 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ఏపీ హైకోర్టుకు తెలిపింది. మూడు రాజధానుల అంశంపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. చట్టం రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేస్తారని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీంతో అమరావతి రాజధానిగా ఏపీ కొనసాగనుంది. అమరావతి రైతుల ఆందోళన, రాజధాని భూములకు సంబంధించిన కేసుల ప్రభావంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీకి అసలు రాజధాని ఏది అనే విషయంపై గందరగోళం నెలకొనడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest News

 
బోరుబావిలో పడిన బాలుడిని కాపాడిన యువకుడు Thu, Jul 07, 2022, 04:28 PM
వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్‌! Thu, Jul 07, 2022, 04:00 PM
ఇదెక్కడి రాజకీయం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని Thu, Jul 07, 2022, 03:54 PM
భీమవరం సభపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు Thu, Jul 07, 2022, 03:51 PM
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ Thu, Jul 07, 2022, 03:23 PM